
శ్రీపాదరావు ఆలిండియా ఫిడే ఓపెన్ చెస్ గోల్డ్ కప్ పోటీలు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ టోర్నీ వాల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ టోర్నీలో పాల్గొనే వారు బుధవారం లోపు www.easypaychess.com వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని హైదరాబాద్ చెస్ సంఘం అధ్యక్షుడు కే.ఎస్ ప్రసాద్ తెలిపారు.