శ్రీపాదరావు ఆలిండియా ఓపెన్‌ చెస్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ షురూ

శ్రీపాదరావు ఆలిండియా ఓపెన్‌ చెస్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ షురూ

హైదరాబాద్, వెలుగు: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు ఆలిండియా ఇండియా ఓపెన్ ఫిడె అండర్-1600 రేటింగ్ చెస్ గోల్డ్ కప్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌‌‌‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు స్విస్ ఫార్మాట్‌‌‌‌లో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల ప్లేయర్లు పోటీ పడుతున్నారని హైదరాబాద్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ తెలిపారు.