బాల్కొండ: కాకతీయ కెనాల్‌‌‌‌కు నీటి విడుదల

బాల్కొండ: కాకతీయ కెనాల్‌‌‌‌కు నీటి విడుదల

బాల్కొండ, వెలుగు: వినాయక నిమజ్జనానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ కు సోమవారం నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మొదట వేయి క్యూసెక్కుల నీటిని వదిలారు. క్రమంగా పెంచుతూ సాయంత్రానికి 5 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువ నుంచి 1850 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 6713 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి 1091 అడుగులు, 80.51టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం 1080 అడుగులు 46.654 టీఎంసీల మేర నీరు ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. కాకతీయ కెనాల్ కు 5 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231, అలీసాగర్‌‌‌‌కు 360, గుత్పా లిఫ్ట్‌‌‌‌కు 405 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.