శ్రీశైలం 10 గేట్లు ఓపెన్.. పెరిగిన వరద

శ్రీశైలం 10 గేట్లు ఓపెన్.. పెరిగిన వరద

కృష్ణానదిలో తగ్గినట్లే తగ్గి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర ఈ సాయంత్రం 10 గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు అధికారులు. డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా ఉండటంతో.. వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నారు అధికారులు

శుక్రవారం సాయంత్రం ఆరింటి వరకు.. శ్రీశైలం ఇన్ ఫ్లో:… 2,80,528 క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుండి 2,60,575 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. సుంకేసుల మీదుగా తుంగభద్ర నది నుండి 43,790 క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం నుంచి మొత్తం 2,80,528 క్యూసెక్కుల వరద నమోదు అయింది. మొత్తం ఔట్ ఫ్లో 3,80,885 క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. 10 గేట్లను 10 అడుగులు ఎత్తి 2,78,460 క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. AP పరిధిలోని కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 29,240 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెలంగాణ ఆధీనంలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,259 క్యూసెక్కులు చొప్పున దిగువన నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులు.

పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 215.807 టీఎంసీలు. ప్రస్తుతం 212.4385 టీఎంసీలు.

గత జులై 31న శ్రీశైలానికి వరద ప్రారంభం అయినప్పటి నుండి ఇవాళ ఉదయం 6 గంటల వరకు జూరాల నుండి శ్రీశైలానికి వచ్చిన మొత్తం వరద 916.541 సిటీఎంసీలు.