శ్రీశైలం గేట్లు మూసివేశారు : పై నుంచి తగ్గిపోయిన వరద

శ్రీశైలం గేట్లు మూసివేశారు : పై నుంచి తగ్గిపోయిన వరద

శ్రీశైలం జలాశయానికి  కొనసాగిన వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువ నుండి వరద ప్రవాహం తగ్గడంతో..  ప్రాజెక్టు అధికారులు గేట్లు మూసివేశారు.  కొన్ని రోజులుగా  ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజులుగా  శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి.. డ్యామ్ పూర్తి స్థాయిలో నిండటంతో ఈ నెల 8న సీఎం చంద్రబాబు విషయం తెలిసిందే. అయితే డ్యామ్ గేట్లను తెరవడంతో శ్రీశైలానికి భక్తులు, పర్యాటకులు పోటెత్తారు. కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి  కొనసాగుతోంది.  

 ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వివరాలు

  • ఇన్ ఫ్లో : 66, 494 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో :  68,753 క్యూసెక్కులు 
  • పూర్తిస్థాయి నీటి మట్టం:   885 అడుగులు  
  • ప్రస్తుత నీటిమట్టం:   882.50  అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ :  215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం నీటి నిల్వ : 201.5820 టీఎంసీలు