
శ్రీ సత్యసాయి జిల్లా.. సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం( జులై3) నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ఈరోజు ( జులై 4) ఉదయం విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బుధవారం ( జులై2) రాత్రి సాంబార్ అన్నం తిన్నామని అప్పటినుంచి అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు చెబుతున్నారు. శాంపిల్స్ ను ల్యాబ్‌కు పంపామని ... ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.