
తిరుపతి: అక్టోబర్ 26(సోమవారం) నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి ఒక రోజు ముందు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 3 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ఈ టోకెన్లు జారీ చేస్తారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు జారీ చేస్తారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని ప్రకటించింది.