
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ కీలకమైన అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం తెలుగు అమ్మాయి శ్రియా రెడ్డిని తీసుకున్నారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆమె పాత్ర ఎంటనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ సినిమాలో అర్జున్ దాస్ కూడా నటిస్తున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక శ్రియా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పందెంకోడి చిత్రంలోని ఈమె నటనకు మంచి పేరు వచ్చింది. పొగరు, అమ్మ చెప్పింది వంటి చిత్రాలలో శ్రియా రెడ్డి నటించింది. ఇక ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య. ఇప్పుడిమే ప్రభాస్ హీరోగా వస్తోన్న సలార్ లో కూడా నటిస్తుంది.
ఇక పవన్ కల్యాణ్ ఓజీ మాత్రమే కాకుండా బ్రో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఏ మూవీ ముందుగా రిలీజ్ అవుతుందో తెలియదు.