కోవిడ్-19 ప‌రీక్షల కోసం.. హైదరాబాద్‌లో ఆర్‌టీ–పీసీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం

కోవిడ్-19 ప‌రీక్షల కోసం..  హైదరాబాద్‌లో ఆర్‌టీ–పీసీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం

భారతదేశంలో ప్ర‌ముఖ‌ డయాగ్నోస్టిక్ చైన్‌లో ఒకటైన ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ ఇప్పుడు ఆర్‌టీ–పీసీఆర్‌ సాంకేతికతతో కూడిన కోవిడ్‌–19 పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇప్పటికే తమ సదుపాయాలను బెంగళూరు, చెన్నైలలో ప్రారంభించిన ఈ ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నోస్టిక్స్‌ హైద‌రాబాద్ న‌గ‌రంతో క‌లిపి 10వ ఆర్‌టీ పీసీఆర్ ల్యాబ్. సికింద్రాబాద్‌లోని సరోజినీ దేవీ రోడ్‌ వద్ద నున్న భువన టవర్స్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్ లో ఈ కోవిడ్‌ టెస్టింగ్‌ లేబరేటరీ ఉంది. కోవిడ్‌–19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల కోసం ఎస్‌ఆర్‌ఎల్‌ను నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లేబరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) ధృవీకరించింది.

ఈ సంద‌ర్భంగా ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) ఆనంద్ కె ‌ మాట్లాడుతూ ‘‘ వైరస్‌కు సంబంధించి అత్యంత కీలకమైన దశలో ఉన్నామని, ప్ర‌జ‌లు త‌మ కార్య‌క‌లాపాల కోసం బయటకు రావడం ప్రారంభించారన్నారు. ఈ స‌మ‌యంలో విస్తృతస్థాయి పరీక్షలు అత్యంత కీలకమ‌ని, ఇప్పటికీ మహమ్మారి నడుమనే ఉన్నాం కాబ‌ట్టి అత్యంత ఆప్రమప్తంగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆర్‌టీ–పీసీఆర్‌ సదుపాయంతో హైదరాబాద్‌లో మరింత మందికి సేవలను అందించగలమ‌ని అన్నారు. దేశంలో అతిపెద్ద డయాగ్నోస్టిక్స్‌ చైన్‌లో ఒకటిగా, వైరస్‌తో పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని, అందరికీ చేరువలో ఉండేందుకు తగిన చర్యలను కొనసాగిస్తాం’’ అని అన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ప్రకారం, హైదరాబాద్‌లో ప్రిస్క్రిప్ష‌న్‌ లేకుండా కూడా కోవిడ్‌–19 పరీక్షలను చేయించుకోవచ్చని, రోగులకు మరింత సౌకర్యవంతంగా సేవలను అందించేందుకు ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ ఇప్పుడు ఇంటి వద్దనే శాంపిల్స్ సేకరించే సదుపాయమూ అందించిందన్నారు. ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌ యొక్క ఫోన్‌ నెంబర్లు 040–40172118కు కాల్‌ చేయడం ద్వారా కోవిడ్‌–19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల కోసం బుక్‌ చేసుకోవచ్చని సీఈవో ఆనంద్ అన్నారు. ఈ పరీక్షా ఫలితాలను 12 నుంచి 24 గంటల లోపుగా అందించడం జరుగుతుందని, ప‌రీక్షా ధరలు మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ధేశించిన విధంగానే ఉంటాయ‌ని అన్నారు.