
వెలుగు: నేటి నుంచి పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత సమయానికంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని విద్యాశాఖ అధికారులు డీఈఓలకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,374 ఎగ్జామ్స్ సెంటర్స్‌లో రెగ్యు లర్ విద్యార్థు లు 5,07,810 మంది, ప్రైవేట్ విద్యార్థు లు 44,492 మంది పరీక్షలు రాయనున్నారు. ఏప్రిల్ 3వరకు ఎగ్జామ్స్ కొనసాగుతాయి. తెలుగు మీడియం విద్యార్థులు 1,68,591 మంది, ఇంగ్లి ష్ మీడియం 3,27,920, ఉర్దూ మీడియంలో 10,601 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్ నంబర్‌ను మెయిన్ ఆన్సర్‌షీట్, అడిషనల్, బిట్ పేపర్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహా ఎక్కడా రాయవద్దని అధికారులు సూచించారు.