గుడ్ న్యూస్..ఎస్​ఎస్​సీ కొత్త నోటిఫికేషన్

గుడ్ న్యూస్..ఎస్​ఎస్​సీ కొత్త నోటిఫికేషన్

భారత ప్రభుత్వ పర్సనల్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లోని వివిధ కేటగిరీల్లో 2065 ఫేజ్‌‌‌‌-X సెలక్షన్‌‌‌‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్లు, సీనియర్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు, రీసెర్చ్‌‌‌‌ అసోసియేట్‌‌‌‌, ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ అటెండెంట్లు, పర్సనల్‌‌‌‌ అసిస్టెంట్, సర్వేయర్‌‌‌‌, ఎంటీఎస్‌‌‌‌ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌‌‌‌, గ్రాడ్యుయేషన్‌‌‌‌, ఆపై ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షను 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌‌‌‌ టైప్‌‌‌‌ మల్టిపుల్‌‌‌‌ ఛాయిస్‌‌‌‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌‌‌‌ మార్కింగ్‌‌‌‌ ఉంటుంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా జూన్​ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. కంప్యూటర్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ ఎగ్జామ్​ ఆగస్టులో ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.ssc.nic.in వెబ్​సైట్​ సంప్రదించాలి.