టెన్త్ అడ్వాన్స్​డ్ లో 80.59% మంది పాస్

టెన్త్ అడ్వాన్స్​డ్ లో 80.59% మంది పాస్
  • సప్లిమెంటరీ రిజల్ట్ రిలీజ్ చేసిన అధికారులు 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్​ అయ్యాయి. 80.59 శాతం మంది పాసైనట్టు అధికారులు ప్రకటించారు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. 71,695 మంది రిజిస్టర్ చేసుకోగా, 66,732 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 53,777 (80.59%) మంది పాసయ్యారు. కాగా, 38,888 మంది బాలురు పరీక్ష రాయగా, 30,528 (78.50%) మంది ఉత్తీర్ణత సాధించారు, 27,844 మంది బాలికలు పరీక్ష రాస్తే 23,249 (83.50%) మంది పాసయ్యారు. 

పాస్​ పర్సంటేజీలో  సిద్దిపేట జిల్లా 99.47% టాప్​ లో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో జనగామ (99.45%), సంగారెడ్డి (98.42%) ఉన్నాయి. చివరి స్థానంలో జగిత్యాల (53.69%), వికారాబాద్ (55.29%) నిలిచాయి.   వాల్యుయేషన్ సెంటర్ల నుంచి కొంత సమాచారం రాకపోవడంతో, కొందరి ఫలితాలను విత్ హెల్డ్​లో పెట్టామని, త్వరలోనే ఆ ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.  ఇంటర్నెట్ ద్వారా పది రోజుల్లోపు ఫలితాలు తెలుసుకునే అవకాశముందని చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయాలనుకునే విద్యార్థులు ఈ నెల 18 వరకు చలాన్ తీసి డైరెక్టరేట్ కు పంపించాలని కోరారు. 

ఇంటర్ ఫస్టియర్​లో 63%.. సెకండియర్​లో 46%

ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్​లో 63% మంది, సెకండియర్​లో 46% మంది పాసయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు అధికారులు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను వెబ్ సైట్​లో పెట్టారు. రాష్ట్రంలో జూన్ 12 నుంచి 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.  ఫస్టియర్​ జనరల్ కోర్సుల్లో 2,52,055 మంది పరీక్ష రాయగా, 1,57,741 (63%) పాసయ్యారు. దీంట్లో 1,12,165 మంది  ఇంప్రూవ్ మెంట్ రాయగా, మరో 45,576 మంది నాన్ ఇంప్రూవ్ మెంట్ కింద ఎగ్జామ్ రాశారు. అయితే, పాసైన వారిలో ఏ గ్రేడ్​ సాధించిన వారు 75,541 మంది. బీ గ్రేడ్​ 36,015 మంది, సీ గ్రేడ్​  లో 24,580,  డీ గ్రేడ్​లో 21,605 మంది ఉన్నారు. 

ఒకేషనల్ కేటగిరీలో 18,697 మంది పరీక్షలు రాయగా,10,319 మంది పాసయ్యారు. సెకండియర్​ జనరల్ కేటగిరీలో 1,29,494 మంది పరీక్ష రాయగా, 59,669 (46%) మంది పాసయ్యారు. ఒకేషనల్​లో 11,013 మంది రాయగా 6,579 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​ కోసం విద్యార్థులు ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. ఫస్టియర్​లో 32 మందిపై, సెకండియర్​లో 8 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని ప్రకటించారు. ఫస్టియర్లో ఒకరు, సెకండియర్​లో 8 మంది ఫలితాలను విత్ హెల్డ్​లో పెట్టినట్టు చెప్పారు.