నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్

నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
  • స్టూడెంట్లు రూపొందించిన ఆజాదీశాట్​

శ్రీహరికోట: ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్(ఇస్రో) మరో చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. తన తొలి స్మాల్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) మిషన్ ను లాంచ్ చేసింది. ఇవాళ  శ్రీహరికోటలోని స్పేస్​ పోర్ట్​ నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్.. ​ఎర్త్​అబ్జర్వేషన్​ శాటిలైట్(ఈవోఎస్) 2 శాటిలైట్​తో పాటు స్టూడెంట్లు రూపొందించిన ఆజాదీశాట్​ను నింగిలోకి మోసుకుపోయింది. 13 నిమిషాల్లోనే ఈ ప్రయోగం పూర్తయింది. 

ఎస్ఎస్ఎల్వీలో ఇదే తొలి మిషన్
పోలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్స్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్​ లాంచ్​ వెహికల్(జీఎస్ఎల్వీ)లతో ఎన్నో విజయవంతమైన మిషన్లను పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు తొలి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాన్ని కూడా నిర్వహించి అంతరిక్ష రంగంలో సత్తా చాటింది. ఎస్ఎస్ఎల్వీల ద్వారా శాటిలైట్లను భూమి లోయర్​ ఆర్బిట్​లోకి ప్రవేశపెట్టింది. గత కొద్ది వారాలుగా శాస్త్రవేత్తలు స్మాల్​ లాంచ్​ వెహికల్స్​ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిన్న శాటిలైట్లకు డిమాండ్​ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ఇస్రో అడుగులు వేస్తూ.. ఇవాళ ఎస్ఎస్ఎల్వీ, ఆజాదీ శాట్ లను ప్రయోగించింది. 


దాదాపు 500 కిలోల బరువు ఉండే  ఈ శాటిలైట్లను.. భూమికి 500 కిలోమీటర్ల దూరంలోని లోయర్​ ఆర్బిట్​లో ప్రవేశపెట్టారు. దీనికి ముందు ఎస్ఎస్ఎల్వీ ప్రయోగానికి 5 గంటల కౌంట్​డౌన్​ జరిగింది. తెల్లవారుజామున 4.18 గంటలకు కౌంట్​డౌన్​ మొదలయి సరిగ్గా 9.18 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది.  శ్రీహరికోటలోని సతీష్​ ధావన్​ స్పేస్​ సెంటర్​లో ఫస్ట్​ లాంచ్​ప్యాడ్​ నుంచి ఎస్ఎస్ఎల్వీ నింగిలోకి వెళుతున్న దృశ్యాలను దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. 

 


72 గంటల్లో చిన్న శాటిలైట్ తయారీ.. ఖర్చు రూ.30కోట్లు
ఇప్పటి వరకు చిన్న, మధ్యస్థ. ఓ మోస్తరు బరువున్న శాటిలైట్లనే పీఎస్ఎల్వీ ద్వారా అంతరిక్షంలోకి పంపేవారు. అయితే ఇప్పుడు చిన్న శాటిలైట్లను కూడా పంపారు. ఈ ప్రయోగం ద్వారా కేవలం 34 మీటర్ల పొవు, 2 మీటర్ల వ్యాసంలో 8 నుంచి 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా భూ కక్ష్యలో ప్రవేశపెట్టే పరిస్థితి ఏర్పడింది.  ఈ చిన్న శాటిలైట్ ను కేవలం ఆరుగురు సైంటిస్టులు కలసి 72 గంటల్లో తయారు చేయొచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా రూ.30కోట్ల లోపే. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ఆజాదీశాట్

ఆజాదీశాట్ శాటిలైట్ ను 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు కలసి రూపొందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 75వ స్వాతంత్ర వార్షికోత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవాలకు గుర్తుగా దీన్ని తయారు చేశారు. కేవలం 8 కిలోల బరువున్న ఆజాదీశాట్ జీవితకాలం ఆరు నెలలు. 
ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో ఉపయోగపడనున్న ఈఓఎస్ 2 శాటిలైట్ 

గతంలో నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలోకి మారిన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ (షార్) నుంచి ఇవాళ విజయవంతంగా ప్రయోగించిన ఈఓఎస్2 శాటిలైట్ బరువు 140 కిలోలు. ఇది భూమిపై మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టవిటీ అందించడంలో ఉపయోగపడుతుంది. భూమిని నిశితంగా పరిశీలించేలా రూపొందించారు.