రాబర్ట్ బాష్‌‌‌‌‌‌‌‌తో టాటా ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌..సెమీ కండక్టర్ల తయారీ

రాబర్ట్ బాష్‌‌‌‌‌‌‌‌తో టాటా ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌..సెమీ కండక్టర్ల తయారీ

న్యూఢిల్లీ:  జర్మన్ టెక్నాలజీ సంస్థ రాబర్ట్ బాష్ జీఎంబీహెచ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ వంటి  కీలక రంగాల్లో పనిచేసేందుకు  ఒప్పందం కుదుర్చుకున్నామని టాటా ఎలక్ట్రానిక్స్ గురువారం ప్రకటించింది. 

ఎంఓయూ ప్రకారం,  అస్సాంలోని టాటాకి చెందిన అసెంబ్లీ అండ్ టెస్ట్ యూనిట్, గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో  చిప్ ప్యాకేజింగ్, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌లో బాష్ సాయం చేస్తుంది. “ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ను సృష్టించాలనే మా లక్ష్యానికి ఈ భాగస్వామ్యం ఒక ముందడుగు.  

భారత ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని గ్లోబల్ స్థాయిలో ముందుంచుతాం” అని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈఓ రణధీర్ ఠాకూర్ తెలిపారు. ఇరు సంస్థలు వెహికల్ ఎలక్ట్రానిక్స్ కోసం కొన్ని లోకల్  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను కూడా వెతుకుతాయి.   

“వెహికల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌కు  డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది. దీనిని గుర్తించాం. సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌ను  పెంపొందించేందుకు టాటా ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది” అని బాష్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సెమీకండక్టర్ ఆపరేషన్స్) డిర్క్ క్రెస్ అన్నారు.