
- జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్
హనుమకొండ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, పౌష్టికాహారం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ సూచించారు. హనుమకొండ జులైవాడలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.
పాఠశాలలో 400 మందికి పైగా ఉన్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు సరిగా లేవన్నారు. పిల్లలకు మంచి బోధన, మెనూ ప్రకారం ఆహారం అందించకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీవో రమేశ్‌రాథోడ్, ఐటీడీఏ ఏపీవో వసంత్ జాదవ్, హనుమకొండ, వరంగల్ డీటీడీవోలు ప్రేమకళ, సౌజన్య తదితరులున్నారు.