బెస్ట్ అవైలబుల్ స్కూల్​లో ప్రవేశానికి ఎస్టీ విద్యార్థులు అప్లై చేసుకోవాలి : కలెక్టర్ నారాయణ రెడ్ది

బెస్ట్ అవైలబుల్ స్కూల్​లో ప్రవేశానికి ఎస్టీ విద్యార్థులు అప్లై చేసుకోవాలి : కలెక్టర్ నారాయణ రెడ్ది
  • వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్ది 

వికారాబాద్, వెలుగు : జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో అడ్మిషన్లకు ఎస్టీ విద్యార్థులు గిరిజన అప్లై చేసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. జిల్లాకు చెందినవారై ఉండి 2024 –-25 విద్యా సంవత్సరానికి 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.  జిల్లాలో 64 సీట్లు ఖాళీగా ఉండగా.. 3వ తరగతిలో 32 , 5 తరగతిలో 16,  8వ తరగతిలో 16 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.  

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామాల్లో నివసించేవారు రూ. 1.50 లక్ష లోపు,  పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు రూ.  2 లక్షలలోపు కలిగి ఉండాలని చెప్పారు.  కుల, ఆదాయ, నివాస, ఆధార్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ప్రస్తుతం చదివిన స్కూల్ బోనాఫైడ్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.  ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో చాన్స్ ఉంటుందని చెప్పారు.

జూన్ 6 లోపు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆఫీసులో దరఖాస్తులు పొంది అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.  జూన్ 12న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికైన విద్యార్థుల జాబితా 13న ప్రకటిస్తామని వెల్లడించారు. ఇతర వివరాలకు  ఫోన్ 9948663053 లో సంప్రదించాలని సూచించారు.