కరోనా డ్యూటీలు చేస్తున్నా జీతాలు వస్తలేవ్..

కరోనా డ్యూటీలు చేస్తున్నా జీతాలు వస్తలేవ్..

ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు వైద్యసే వలు చేస్తున్న స్టాఫ్ నర్సులకు జీతాలు రావడం లేదు. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో రిక్రూట్ అయిన 200 మంది స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో డ్యూటీలు ఎట్లచేయాలని ప్రశ్నిస్తున్నారు. కుటుంబాలు గడవడం మాటేమో కానీ, డ్యూటీకి రావాలంటే ఆటోచార్జీలకు  కూడా పైసల్లేవని వాపోతున్నారు.

చాలీచాలని జీతాలు

2017 సంవత్సరంలో జీఓ నంబర్ 544 ప్రకారం 96 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డ్యూటీలో చేరారు. మొదట్లోరూ.14,190 బేసిక్ శాలరీపై డ్యూటీలో చేరారు. ప్రస్తుం వీరి శాలరీ రూ.23వేలకు పెరిగింది. పక్కనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జీవో ప్రకారం రిక్రూట్ అయి పని చేస్తున్న కాంట్రాక్ట్స్టాఫ్ నర్సులకు రూ.32వేల జీతం ఇస్తున్నారు. జీతం తక్కువున్నప్పటికీ నాలుగు నెలలుగా అది కూడా రావడంలేదు. కాం ట్రాక్ట్ పద్దతిన ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తు న్న ఎంప్లాయీస్ కు వేతనంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంటుంది . ఇక్కడ ఇలాంటి వేవీ కల్పించలేదని చెబుతున్నారు. చాలీచాలని జీతానికి పనిచేస్తున్న తమకు నెలల తరబడి చెల్లిం చకపోవడంపై తిప్పులు పడుతున్నామని అంటున్నారు.

చేరినప్పటి నుంచి జీతం రాలే..

కరోనా వైరస్ విస్తరించడంతో జీజీహెచ్ లో ఏప్రిల్ నెలాఖరులో ఔట్ సోర్సింగ్ కింద 104 మంది స్టాఫ్ నర్సులను తీసుకున్నారు. రూ. 25వేలు జీతం ఇస్తామని చెప్పారు. డ్యూటీ ఎక్కి నాలుగు నెలలు అవుతుండగా వారికి జీతమే రాలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో డ్యూటీ చే స్తున్న వారు జీతాల గురించి నర్సింగ్ సూపరిం టెండెంట్ ను అడిగితే పనిష్మెంట్ కింద ఎక్కడ కంటిన్యూగా డ్యూటీలు వేస్తారోనని భయపడు తున్నారు. జీతం అడిగితే బడ్జెట్ డ్జె లేదని, శాలరీలు రాలేదనే సమాధానం వస్తున్నట్లుచెబుతున్నారు. మంత్రులకు వినతి హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిఇటీవల కరోనా రివ్యూ మీటింగ్ కు వచ్చినప్పుడు కాంట్రాక్ట్  ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు వినతిపత్రం అందజేశారు. తమకు కొద్ది నెలలుగా జీతాలు రావడం లేదని గోడు వెల్లబోసుకున్నారు. కరోనా డ్యూటీలు చేస్తున్న తమకు జీతాలు సమయానికి అందించేలా చూడాలని కోరారు.