దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 12 వేల 256 గ్రూప్–బి, గ్రూప్–సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు మే 21 నుంచి జూన్ 22 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు/ సెప్టెంబర్‌లో నిర్వహించే టైర్–I, డిసెంబర్‌లో జరిగే టైర్-–II కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టు పేరు: గ్రూప్–బి, గ్రూప్–సి పోస్టులు.
మొత్తం పోస్టులు: 12,256.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జేఎస్ఓ పోస్టులకు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతోపాటు 12వ తరగతి గణితంలో కనీసం 60 శాతం లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–II పోస్టులకు స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్, ఆపరేషన్ రీసెర్చ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. అదనపు అర్హతలుగా సీఏ, సీఎంఏ, సీఎస్, ఎం.కామ్, ఎంబీఏ (ఫైనాన్స్) లేదా ఎంబీఈ ఉన్నాయి.
వయోపరిమితి: 18 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 21.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జూన్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: టైర్–I, టైర్-–II కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
టైర్-I కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తేదీ: 2026, ఆగస్టు – సెప్టెంబర్ (తాత్కాలికం).
టైర్-II కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తేదీ: 2026, డిసెంబర్ (తాత్కాలికం).
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssc.gov.inను సందర్శించండి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ–1)
టైర్–1 కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను టైర్--2 ఎంపికకు మాత్రమే పరిగణిస్తారు. కానీ, అంతిమ మెరిట్ లిస్టులో కలపరు.
టైర్–1 సిలబస్
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
పోలికలు, సారూప్యతలు, స్పేస్ విజువలైజేషన్, సమస్యల సాధన, అర్థమెటిక్ రీజనింగ్, సంఖ్యా శ్రేణులు, కోడింగ్-–డికోడింగ్, వెన్ చిత్రాలు, దాగి ఉన్న చిత్రాలు, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ , సోషల్ ఇంటెలిజెన్స్.
జనరల్ అవేర్‌నెస్
వర్తమాన అంశాలు, భారతదేశం–పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం, ఆర్థిక రంగం, జనరల్ పాలసీ, శాస్త్రీయ పరిశోధనలు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
పూర్ణ సంఖ్యలు, దశాంశాలు, భిన్నాలు, శాతాలు, నిష్పత్తి, సగటులు, బారువడ్డీ/చక్రవడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్, కాలము-–పని, కాలము–-దూరము, బీజగణితం, జ్యామిట్రీ, క్షేత్రగణితం, త్రికోణమితి, బార్ చార్టులు, పై చార్టులు.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్
గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, రైటింగ్ ఎబిలిటీ.
