సైంటిఫిక్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

సైంటిఫిక్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

భారత వాతావరణ శాఖలో 990 సైంటిఫిక్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ) నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. డిగ్రీ/డిప్లొమా పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్షను కంప్యూటర్‌‌‌‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు విభాగాలుంటాయి. పార్ట్‌‌‌‌-1లో జనరల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ అండ్‌‌‌‌ కాంప్రహెన్షన్, జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌.. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌‌‌‌-2లో ఫిజిక్స్‌‌‌‌/ కంప్యూటర్‌‌‌‌ సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెలి కమ్యూనికేషన్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ వీటిలో అభ్యర్థి ఎంచుకున్న విభాగం నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు.

అర్హత: డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఫిజిక్స్‌‌‌‌/ కంప్యూటర్‌‌‌‌ సైన్స్‌‌‌‌/ ఇన్ఫర్మేషన్‌‌‌‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌‌‌‌ అప్లికేషన్స్‌‌‌‌లో ఏదో ఒకటి చదివుండాలి. లేదా ఎలక్ట్రానిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ టెలికమ్యూనికేషన్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌లో డిప్లొమా పూర్తిచేయాలి. డిగ్రీ లేదా డిప్లొమాలో ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. అలాగే 10+2 (ఇంటర్‌‌‌‌)లో మ్యాథ్స్, ఫిజిక్స్‌‌‌‌ చదవాలి. వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌‌‌‌: ఏడో వేతన సంఘం లెవెల్‌‌‌‌-6 ప్రకారం చెల్లిస్తారు. అంటే ఉద్యోగంలో చేరినవారు రూ.35,400 మూలవేతనం అందుకోవచ్చు. డీఏ, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏ, ఇతర అలవెన్సులు కలుపుకుని వీరి నెల జీతం సుమారు రూ.60 వేల వరకు ఉంటుంది. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్​లో అక్టోబర్​ 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ. 100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు లేదు) చెల్లించాలి. పరీక్షలు డిసెంబరులో నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌‌‌‌లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​ను​ సంప్రదించాలి.