స్తంభాద్రి హాస్పిటల్ లో రోబొటిక్ మోకాలు మార్పిడి సర్జరీ సక్సెస్

స్తంభాద్రి హాస్పిటల్ లో రోబొటిక్ మోకాలు మార్పిడి సర్జరీ సక్సెస్

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని నెహ్రూ నగర్ లో ఉన్న స్తంభాద్రి హాస్పిటల్ లో జిల్లాలోనే ప్రథమంగా ఇంపోర్టెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీని సక్సెస్ ఫుల్ గా చేసినట్లు సీనియర్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మెదరమేట్ల అనిల్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యూరో సర్జన్ డాక్టర్ గట్టినేని సురేశ్, యురాలజిస్ట్ డాక్టర్ గుమ్మడి రాఘవేంద్రరావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ పేర్ల హర్షతేజ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ సుమంత్ తో కలిసి మాట్లాడారు.

ఎన్నోఏండ్ల నుంచి మోకాలి నొప్పితో బాధ పడుతున్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా పట్వారీగూడెంకు చెందిన పేషెంట్ కొటేశ్వరి(55) కి ఇంపోర్టెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీ చేసినట్లు తెలిపారు.  ఈ సర్జరీ ద్వారా పేషెంట్ కు తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, త్వరగా కోలుకుంటారని చెప్పారు. లాభాపేక్ష లేకుండా అత్యాధునిక వైద్య సాంకేతికతను ఉపయోగించి గ్రామీణ, పట్టణ ఏరియా ప్రజలకు స్తంభాద్రి హాస్పిటల్ లో ఇంపోర్టెడ్ రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.