
మడగాస్కర్ దేశంలో ఘోరం జరిగింది. రాజధాని అంటనానరివో నగరంలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 16 మంది చనిపోయారు. పదులసంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
స్థానిక మహమసిన స్టేడియంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు అక్కడి అధికారులు. ఈ వేడుకలకు వేల సంఖ్యలో జనం వచ్చారు. 22వేల మంది ఈ స్టేడియం కెపాసిటీ. ఐతే.. మిలటరీ, ఇతర స్పోర్ట్స్ పరేడ్ చూసేందుకు అంచనాలకు మించిన జనం స్టేడియానికి వచ్చారు. జనం మధ్య తొక్కిసలాట జరగడంతో. .. కనీసం 16 మంది చనిపోయినట్టు ప్రాథమికంగా ప్రకటించారు.