చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎయిర్ షో లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇవాళ (2024, అక్టోబర్ 6) మెరీనా బీచ్‌లో ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షోను చూసేందుకు లక్షలాదిగా సందర్శకులు వచ్చారు. ఊహించని సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో వందల మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే, ఎయిర్ షో ముగిశాక ఒక్కసారిగా లోకల్ రైల్వే స్టేషన్కు జనం క్యూ కట్టారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ తొక్కి సలాటలో మృతుల సంఖ్యలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.