వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెర్రీ, ఉపాసన

వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెర్రీ, ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన కామినేని మరోసారి విహారయాత్రకు బయలుదేరినట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూన్ 14న ఈ స్టార్ జంట వివాహ వార్షికోత్సవం నేపథ్యంలో వీరు ఈ వెకేషన్ కు వెళ్లినట్టు సమాచారం. వారి వివాహా బంధానికి పదేళ్లు నిండటంతో ఇలా స్పెషల్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్లోరెన్స్ కు వెళ్లిన ఈ స్టార్ కపుల్ ఎయిర్ పోర్ట్ వద్ద కెమెరాకు చిక్కారు. ఇక  మొన్నటివరకూ ఆర్ఆర్ఆర్, ఆచార్య ప్రమోషన్స్, రిలీజ్ లతో బిజీగా గడిపిన రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం చెర్రీ చేయబోతున్న విషయాలకొస్తే.. తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం యొక్క 'RC15' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రూ.170కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ  పొలిటికల్ డ్రామా చిత్రం జనవరి 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుందని సినీ వర్గాల టాక్.