కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (ChiyaanVikram) హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. విక్రమ్కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది.
లేటెస్ట్గా తంగలాన్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విక్రమ్ లుక్స్, ఎదురుపడే శత్రు సైన్యంతో.. విక్రమ్ చేసే విరించిత పోరాట సన్నివేశాలతో టీజర్ అదిరిపోయింది. గిరిజన తెగలో ఆపద వస్తే..కరుడుగట్టిన నాయకత్వంతో ముందుకు కదిలిన విక్రమ్..తనదైన నటనతో టీజర్ హైలెట్గా నిలిచింది. ఈ టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా..ఎమోషన్స్తో, పోరాట సన్నివేశాలతో సాగించాడు డైరెక్టర్ పా. రంజిత్. దీంతో తంగలాన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీలో పార్వతి ముఖ్య పాత్రలో నటిస్తుండగా..మరో కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 జనవరి 26న రిలీజ్ కాబోతుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
రీసెంట్గా ఎస్.యు.అరుణ్‌కుమార్ (S.U. Arun Kumar) డైరెక్షన్ లో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. Chiyaan62 మూవీగా అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా..అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Also Read :- మంచు విష్ణు హెల్త్ అప్డేట్పై.. ట్వీట్ చేసిన మోహన్ బాబు
