ముందే గుర్తిస్తే క్యాన్సర్​ను.. నయం చేయొచ్చు.. స్టార్ హాస్పిటల్స్ ఎండీ

ముందే గుర్తిస్తే క్యాన్సర్​ను.. నయం చేయొచ్చు.. స్టార్ హాస్పిటల్స్ ఎండీ

ముందే గుర్తిస్తే క్యాన్సర్​ను.. నయం చేయొచ్చు
స్టార్ హాస్పిటల్స్ ఎండీ మన్నెం గోపీచంద్   
చిరంజీవి బ్లడ్ బ్యాంక్​లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ 
ఈనెల 16న వైజాగ్​లో, 23న కరీంనగర్​లో క్యాంపు

హైదరాబాద్, వెలుగు : సొసైటీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని స్టార్ హాస్పిటల్స్ ఎండీ మన్నెం గోపీచంద్ అన్నారు. ఆదివారం స్టార్ హాస్పిటల్స్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ తోపాటు ఎలాంటి వ్యాధినైనా ముందే కనుక్కుంటే త్వరగా తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. 

క్యాన్సర్ విషయంలో లక్షణాలు కనిపించిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఒక్కోసారి క్యాన్సర్ స్టేజ్ దాటిన తర్వాతే లక్షణాలు కనిపిస్తాయన్నారు. క్యాన్సర్​ను ముందస్తుగా గుర్తించి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ లో ముందుకు వెళ్లడం కోసమే స్క్రీనింగ్ క్యాంప్​లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల16న వైజాగ్ లో, 23న కరీంనగర్​లో క్యాంప్​లు ఏర్పాటు చేస్తామని, అందరూ వినియోగించుకోవాలన్నారు. 

తెలుగు రాష్ట్రాలలో 20 ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తామన్నారు. చిరంజీవి ట్రస్ట్ తరఫున ఇప్పటివరకు రక్తదానం నేత్రదానం మీద అవగాహన పెంచామని, ఇకపై క్యాన్సర్ నివారణ కోసం కూడా పని చేస్తామని నటుడు నాగబాబు అన్నారు. క్యాంపులో టెస్టుల కోసం 2వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలి పారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, దొరై, తదితరులు పాల్గొన్నారు.