
బాలీవుడ్ క్యూట్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. టాలీవుడ్ వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ అర్జున్ రెడ్డి తరువాత సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన రణ్‌బీర్ లుక్ కి కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. వివాదాలకు దూరంగా ఉండే రణ్‌బీర్ కపూర్, తాజాగా బాలీవుడ్ పరిశ్రమపై కొన్ని క్రేజీ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ గతకొంతకాలంగా ట్రాక్ తప్పిందని రణ్‌బీర్ కపూర్ అన్నాడు. గత 20 ఏళ్ల కాలంలో వెస్ట్రన్ కల్చర్‌పై ఆధారపడి బాలీవుడ్ తన ఒరిజినాలిటీని కోల్పోయిందని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
ప్రస్తుతం ప్రేక్షకులకు ఏం కావాలో అది తెలుసుకోవడంలో మేకర్స్ విఫలమవుతున్నారని.. బాలీవుడ్ పరిశ్రమ అయోమయంలో పడిందని రణ్‌బీర్ అన్నాడు. కొంతమంది హీరోహీరోయిన్లు కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, వారు ఈ పద్ధతిని మార్చుకుంటే ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్స్ బయటకొస్తాయని, అప్పుడు ఇండస్ట్రీ మళ్ళీ సక్సెస్ బాటలో పయనిస్తుందని రణ్‌బీర్ సూచించాడు. త్వరలోనే ఈ విషయంలో మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నట్లుగా రణ్‌బీర్ అన్నాడు. ఇక ఇటీవల ‘తూ జూఠీ మై మక్కార్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న రణ్‌బీర్ కపూర్, ‘యానిమల్’ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకునేందుకు సిద్దమయ్యాడు.