స్టార్స్​ మెచ్చిన స్పోర్ట్స్​ గర్ల్ 

V6 Velugu Posted on Jun 22, 2021

తలకి  హెల్మెట్​....కాళ్లకి  ప్యాడ్స్​..చేతిలో బ్యాట్​.. జెట్ స్పీడ్​లో దూసుకొస్తున్న బంతులు..వాటిని అంతే వేగంగా తిప్పి  కొడుతున్న మెహక్​ ఫాతిమా..ప్రతి బంతీ బౌండరీ దాటుతోంది. ఎటు చూసినా సిక్స్​లు, ఫోర్లే కనిపిస్తున్నాయ్​. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్​లో సెన్సేషన్​ అవుతోంది. ప్రముఖులతో బేష్​  అనిపించుకుంటోంది. దీనికి కారణం తన టాలెంట్​ ఒక్కటే కాదు. అంత చిన్న వయసులో  ఆ చిన్నారి ఎదుర్కొన్న వివక్ష. దాన్ని ప్రశ్నించిన తీరు కూడా.
ఆడపిల్ల అని...
​ సోషల్​ మీడియా స్టార్​గా నిలిచిన మెaహక్​ సొంతూరు కేరళలోని కొజికోడ్​. ఈ చిన్నారి తండ్రి మునీర్​ క్రికెటర్​. స్కూల్​, కాలేజీల తరపున కొన్ని టోర్నమెంట్స్​ కూడా ఆడాడు. కానీ, కుటుంబ బాధ్యతలు తనకిష్టమైన క్రికెట్​ని దూరం చేశాయి. ఫ్యామిలీ బిజినెస్​ వైపు నడిపించాయి. దాంతో తన డ్రీమ్​ని తన పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలి అనుకున్నాడు మునీర్. తన మూడేళ్ల కొడుక్కి క్రికెట్​ నేర్పించడం మొదలుపెట్టాడు. మెహక్​కి క్రికెట్​ అంటే చాలా ఇష్టం. కానీ, తనకన్నా చిన్నవాడైన తమ్ముడికి తండ్రి క్రికెట్​ నేర్పించడం చూసి బాధపడింది. దాంతో ‘నేను ఆడపిల్లని అనేగా క్రికెట్​కి దూరంగా ఉంచుతున్నావ్​.. ’ అని  తండ్రిని అడిగింది. ఆ ప్రశ్న మునీర్​ని ఆలోచింపజేసింది..తనేం తప్పు చేస్తున్నాడో అర్థమయ్యింది. 
ఎనిమిది నెలల్లో.. 
2020 వ సంవత్సరం నవంబరులో క్రికెట్​ ప్రాక్టీస్​ మొదలుపెట్టింది మెహక్​. తండ్రి సపోర్ట్​తో ఎనిమిది నెలల్లోనే భారీ షాట్స్​ కొడుతోంది. ఏ దిక్కు నుంచి బంతి వచ్చినా నిమిషాల్లో కొట్టడం చూసి తండ్రే షాక్​ అయ్యాడు. తన కూతురి టాలెంట్​ని ప్రపంచానికి పరిచయం చేయాలని..మెహక్​ బ్యాటింగ్​ చేస్తున్న వీడియోని ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. కొద్దిసేపటికే ఆ వీడియోకి కుప్పలుతెప్పలుగా లైక్స్​, షేర్స్​  వచ్చిపడ్డాయ్. ఇండియన్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్​ మిథాలీ రాజ్​ కూడా ఈ చిన్నారి గురించి ట్వీట్​ చేసింది. ‘‘నీకు నా సపోర్ట్​, బ్లెస్సింగ్స్​ ఎప్పుడూ ఉంటాయి. నీలా స్పోర్ట్స్​ వైపు అడుగులేస్తున్న ప్రతి అమ్మాయినీ నేను సపోర్ట్​ చేస్తా. అని రాసింది. నా నుంచి ఏదైనా సాయం కావాలంటే ఒక్క మెసేజ్​ చేయండి’’అని మెహక్​ పేరెంట్స్​ని కోరింది మిథాలీ రాజ్.​‘‘ఫ్యూచర్​ సూపర్​స్టార్’’​ అంటూ ట్వీట్​ చేసిన ఆనంద్​ మహీంద్ర ‘‘ఈ చిన్నారి టాలెంట్​ని వేస్ట్​కానివ్వద్దు” అన్నాడు.  

మెహక్​ ఫాతిమా..వయసు ఆరేళ్లు..ఇంత చిన్న పాప గురించి ఏంటి డిస్కషన్​  అంటారా!  ఈ చిన్నారి స్పెషాలిటీ అలాంటిది మరి. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చిన్న వయసులోనే  తన  బ్యాటింగ్​తో అందర్నీ మెప్పిస్తోంది ఈ చిచ్చర పిడుగు. రీసెంట్​గా ఈ చిన్నారి ఫ్యాన్స్​ ​ లిస్ట్​లో  ఇండియన్ విమెన్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్​ మిథాలీ రాజ్​, క్రికెటర్​  జెమీమా రోడింగ్స్​, ఆనంద్​ మహీంద్రా  కూడా చేరిపోయారు. ట్విట్టర్​ కూడా ఈ చిన్నారి టాలెంట్​కి సలాం చేస్తోంది. 

Tagged Cricket, kerala, Viral Video, stars, bats, , Favorite, Sports Girl, flawlessly

Latest Videos

Subscribe Now

More News