- 2023లో స్టార్టప్‌లకు కష్టకాలమే!
- ఫండ్స్ సేకరించడంలో ఇబ్బందులు..
- బిజినెస్‌లు మూసేసిన 15 కంపెనీలు
- 24 వేల మంది ఉద్యోగులు ఇంటికే
బిజినెస్ డెస్క్, వెలుగు: స్టార్టప్‌లకు 2023 కలిసి రాలేదు. ఫండింగ్ సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భారీ మొత్తంలో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చింది. జెస్ట్‌మనీ, స్ట్రయికర్, అనర్, క్విజీ, ఫ్రంట్‌రో, అకుడో వంటి స్టార్టప్‌లు తమ బిజినెస్‌లను మూసేశాయి. కొన్ని స్టార్టప్‌లు మాత్రం మార్కెట్లో లిస్ట్ అయ్యి సక్సెస్ కూడా చూశాయి. 2023 లో కేవలం రెండు స్టార్టప్‌లు మాత్రమే యూనికార్న్‌లుగా మారాయి. ది క్రెడిబుల్ డేటా ప్రకారం, సుమారు 980 స్టార్టప్‌లు ఇన్వెస్టర్ల నుంచి 11 బిలియన్ డాలర్లు సేకరించాయి. ఇందులో 181 గ్రోత్ స్టేజ్ స్టార్టప్‌లు 8.8 బిలియన్ డాలర్లు, 656 ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌లు 2.5 బిలియన్ డాలర్లు సేకరించాయి.
మిగిలిన 147 స్టార్టప్‌లు తమ డీల్స్ గురించి బయటపెట్టలేదు. 2023 లో జెప్టో, ఇన్‌క్రెడ్ యూనికార్న్‌లుగా మారాయి. బిలియన్ డాలర్ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్‌లను యూనికార్న్‌లు అంటారు. అదే 2021 లో అయితే 44 యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. 2022 లో ఈ నెంబర్ 26 గా ఉంది. ఇండియన్ స్టార్టప్‌లు 2021 లో 38 బిలియన్ డాలర్లు, 2022 లో 25 బిలియన్ డాలర్లు సేకరించాయని, అదే 2023 లో కేవలం 11 బిలియన్ డాలర్లు మాత్రమే అందుకున్నాయని ది క్రెడిబుల్ రిపోర్ట్ పేర్కొంది. డీల్స్ సంఖ్య కూడా 2021 లో 1,625 ఉంటే 2023 లో 984 కి తగ్గిందని తెలిపింది.
ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్ టాప్‌లో
ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, లెన్స్‌కార్ట్ వంటి లేట్ స్టేజ్ (బిజినెస్ విస్తరించిన) స్టార్టప్‌లు పెద్ద మొత్తంలో ఫండ్స్ సేకరించగలిగాయి. ఫోన్‌పే 850 మిలియన్ డాలర్లు, ఫ్లిప్‌కార్ట్ 600 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 600 మిలియన్ డాలర్లను ఇన్వెస్టర్ల నుంచి అందుకున్నాయి. లెండింగ్ ప్లాట్‌ఫామ్ డీఎంఐ ఫైనాన్స్ 400 మిలియన్ డాలర్లను, ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ 385 మిలియన్ డాలర్లను సేకరించాయి. ఫండ్స్ సేకరించిన టాప్ 5 స్టార్టప్‌లో చోటు దక్కించుకున్నాయి. ఉడాన్, బైజూస్, జెప్టో, పెర్ఫియోస్, గ్రేఆరెంజ్ వంటి స్టార్టప్‌లు టాప్ 10 లో ఉన్నాయి. ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌లలో ఇన్సూరెన్స్ దేఖో (150 మిలియన్ డాలర్లు ), అజిలిటాస్ స్పోర్ట్స్ (64 మిలియన్ డాలర్లు), ఛార్జ్‌జోన్ (54 మిలియన్ డాలర్లు ), బ్లూస్మార్ట్ (42 మిలియన్ డాలర్లు), సర్వం ఏఐ (41 మిలియన్ డాలర్లు) పెద్ద మొత్తంలో ఫండ్స్ సేకరించగలిగాయి.
లేఆఫ్స్..
దిక్రెడిబుల్ రిపోర్ట్ ప్రకారం, ఇండియన్ స్టార్టప్‌లు 2023 లో 24 వేల మంది ఉద్యోగులను తీసేశాయి. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 7,000 –8,000 మందిని ఇంటికి పంపించేసింది. డంజో, అన్అకాడమి, జెస్ట్‌మనీ, ఉడాన్, సింప్లిలెర్న్లు కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. స్టార్టప్ కంపెనీలు 2022 లో 20 వేల మందిని తొలగించాయి. సుమారు 15 స్టార్టప్‌లు తమ బిజినెస్‌లను క్లోజ్ చేసేశాయి. క్రికేట్ ఎన్ఎఫ్టీ స్టార్టప్ రారియో 60 శాతం మంది ఉద్యోగులను తీసేసింది. దివాలా తీసే స్టేజ్‌లో ఉంది. గోమెకానిక్కు 70 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. చివరికి లైఫ్‌లాంగ్ గ్రూప్ దీనిని కొనుగోలు చేసింది.
బెంగళూరులోనే ఎక్కువ..
2023 లో ఫండ్స్ సేకరించిన స్టార్టప్‌లలో బెంగళూరు నుంచి ఎక్కువ ఉన్నాయి. సుమారు 433 స్టార్టప్‌లు 6.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సేకరించగలిగాయి. ఇండియన్ స్టార్టప్‌లు అందుకున్న మొత్తం ఫండ్స్‌లో 55 శాతం ఈ సిటీలోని స్టార్టప్‌లకే దక్కాయి. ఢిల్లీ –ఎన్సీఆర్కు చెందిన 217 స్టార్టప్‌లు 2.2 బిలియన్ డాలర్లు సేకరించగలిగాయి. ముంబై, చైన్నై, పూణె సిటీలలోని స్టార్టప్‌లు ఆ తర్వాత ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. ఎక్కువగా ఈ–కామర్స్ నుంచి 167 స్టార్టప్‌లు 2.9 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఫిన్‌టెక్, సాస్, హెల్త్‌టెక్, ఈవీ సెక్టార్లలోని కంపెనీల ఆ తర్వాత ప్లేస్‌లో ఉన్నాయి. అమౌంట్ పరంగా ఈవీ, సాస్, హెల్త్‌టెక్ స్టార్టప్‌లు ఎక్కువ సేకరించాయి.