ఇంటర్ బాధిత తల్లిదండ్రులకు రాష్ట్ర బీజేపీ నేతల పరామర్శ

ఇంటర్ బాధిత తల్లిదండ్రులకు రాష్ట్ర బీజేపీ నేతల పరామర్శ

వరంగల్ అర్బన్ : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల ప్రకటన తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. ఇంటర్ పరీక్ష ఫలితాల తర్వాత రాష్ట్రంలో దాదాపు 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ విషాదాలు జరిగాయనీ.. బలవన్మరణాలకు పాల్పడిన
ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రంలోని విపక్షాలు ఇప్పటికే పోరుబాట పట్టాయి.

బాధిత తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, పొంగులేటి సుధాకర్ రెడ్డి , పేరాల శేఖర్ రావు, చింత సాంబమూర్తి, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, గుండాగోని భరత్ గౌడ్ , ఇతర నేతలు బాధిత కుటుంబీకులను పరామర్శించనున్నారు.