నిజామాబాద్ ‌‌‌‌‌‌‌లో ఉత్కంఠగా సాగిన కాకా టోర్నీ ముగింపు

నిజామాబాద్ ‌‌‌‌‌‌‌లో ఉత్కంఠగా సాగిన కాకా టోర్నీ ముగింపు
  • ఫైనల్‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్ జట్టు విజయం

కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ లీగ్ క్రికెట్ టోర్నీ శుక్రవారం ఉత్కంఠగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్, కామారెడ్డి జట్లు తలపడ్డాయి.  టాస్ గెలిచిన కామారెడ్డి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. అనంతరం నిజామాబాద్ జట్టు 18.1 ఓవర్లలోనే 136 పరుగులు చేసి విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. 

ఈ ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్ జట్టుకు చెందిన విక్రమ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు 22 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ప్రతిభకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందజేశారు. రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు కిషన్ పాల్గొని ఫైనల్ విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు.  -వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్