బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర

బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర

హైదరాబాద్, వెలుగు : ఎన్నికల ఏడాది భారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో 2023 - 24 బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 40 నిమిషాల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ తో పాటు నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రుణాలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ పూర్తి చేయడానికి నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో కొత్త స్కీములేవీ పెట్టలేదని సమాచారం.

అయితే అసెంబ్లీ సమావేశాలకు మంత్రులందరూ తప్పకు హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో బాగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను క్యాబినెట్ సహచరులు అభినందించినట్టు సమాచారం. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ బీఆర్ఎస్ సభకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉన్నందున క్యాబినెట్ సమావేశాన్ని త్వరగా ముగించినట్టు తెలుస్తోంది. కాగా సోమవారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కౌన్సిల్ లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.