మీ సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్టేట్ కమిషనర్

మీ సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్టేట్  కమిషనర్

కోదాడ,వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మీసేవా కేంద్రాన్ని శుక్రవారం స్టేట్  కమిషనర్  రవికుమార్  తనిఖీ చేశారు. అందిస్తున్న సేవలు, రుసుము వసూళ్లు, టోకెన్  విధానం, డిజిటల్  రికార్డులు తదితర అంశాలను పరిశీలించారు. రిజిస్టర్‌, లాగిన్  రిపోర్టులు, పని వేళల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలపై ఆయన ఆరా తీశారు. 

ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ మీ సేవా కేంద్రాలు నిబంధనలు పాటిస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందిస్తున్నాయని తెలిపారు. మీసేవా కేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.