ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి..    ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి..    ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ

నిర్మల్, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 20న హైదరాబాద్ లో నిర్వహించే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం నిర్మల్ లోని టీఎన్జీవో భవన్​లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లను కేటాయించాలన్నారు.

3ఉద్యమకారులందరికీ పెన్షన్, ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, హెల్త్ కార్డులను ఇవ్వాలన్నారు. ఆత్మ త్యాగం చేసిన 1200 మంది కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ ​చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ వద్ద ఆత్మ గౌరవ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కొట్టె శేఖర్, రామకృష్ణ గౌడ్, సామ కిరణ్ రెడ్డి, పోతన్న, గంగన్న, కామారపు జగన్ తదితరులు పాల్గొన్నారు.