సర్వేపల్లికి నివాళులు అర్పించిన మంత్రి సబిత

సర్వేపల్లికి నివాళులు అర్పించిన మంత్రి సబిత

హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ట్యాంక్ బండ్ లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసిన నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీవితం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశారన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందని ఆయన చెప్పిన విషయం అక్షర సత్యమని స్పష్టం చేశారు. ఏం రంగంలో విజయం సాధించాలన్నా గురువు ఉండాల్సిందేనని, అలాంటి గురువులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

రాష్ట్రప్రతిగా, రచయితగా, ఫిలాసఫర్ గా సర్వేపల్లి బహుముఖ ప్రతిభాశాలి అని, అయితే  టీచర్ గా ఉండటమే ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో  ఉపాధ్యాయుల కృషి గొప్పదని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.