- రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారి లక్ష్మి
దేవరకొండ, వెలుగు : మూడో విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారి లక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని కేశ్యతండా లో నామినేషన్ల ప్రక్రియను దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వస్తున్న ప్రతి సర్పంచ్, వార్డు అభ్యర్థుల నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
అంతకుముందు చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమాల్లో కొండమల్లేపల్లి ఎంపీడీవో స్వర్ణలత, ఎమ్మార్వో నరేందర్, సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యులు తడక మల్ల శ్రీనుకుంభం పుల్లారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
