కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ శాఖ యాక్షన్.. నలుగురు కల్లు వ్యాపారులు అరెస్ట్

కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ శాఖ యాక్షన్.. నలుగురు కల్లు వ్యాపారులు అరెస్ట్

హైదరాబాద్: కూకట్‎పల్లి కల్తీ కల్లు ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంది. గత మూడు రోజులుగా కల్తీ కల్లు తాగి ప్రజలకు అస్వస్థతకు గురవుతుండటంతో రంగంలోకి ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఐదు బృందాలుగా ఏర్పడి హైదర్‌నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్‌నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లో కల్లు కంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. 

శాంపిల్స్‌ను నారాయణగూడ రసాయన పరిశీలన కేంద్రానికి పంపారు అధికారులు. పరీక్షల్లో భాగ్యనగర్ మినహా మిగతా మూడు దుకాణాల్లో మత్తు మందుల కలయికతో కల్లు తయారీ జరిగినట్లు తేలింది. నివేదిక ఆధారంగా నలుగురు కల్లు వ్యాపారులు రవితేజ గౌడ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు. 

►ALSO READ | గోల్డ్ వ్యాపారులారా జాగ్రత్త.. ఫేక్ పోలీసులు వస్తుండ్రు: ఆదిలాబాద్‎లో నకిలీ SI, CI అరెస్ట్

హైదర్‌నగర్, హెచ్ఎంటీ హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది జిల్లా ఎక్సైజ్ శాఖ. కాగా, కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.