గోల్డ్ వ్యాపారులారా జాగ్రత్త.. ఫేక్ పోలీసులు వస్తుండ్రు: ఆదిలాబాద్‎లో నకిలీ SI, CI అరెస్ట్

గోల్డ్ వ్యాపారులారా జాగ్రత్త.. ఫేక్ పోలీసులు వస్తుండ్రు: ఆదిలాబాద్‎లో నకిలీ SI, CI అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పోలీసుల గుట్టురట్టు అయ్యింది. పోలీసుల వేషంలో షాపు యాజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతోన్న నకిలీ ఎస్ఐ, సీఐ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గురువారం (జూలై 10) ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వెల్లడించారు. 

ఇచ్చోడలో బంగారు దుకాణ యాజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇర్పాన్, ప్రవీణ్ అనే నకిలీ పోలీసులను అరెస్ట్ చేశామని తెలిపారు. బంగారం అమ్మకాలలో మోసాలకు పాల్పడుతున్నారని యజమానులను బెదిరించి.. డబ్బులు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని నిందితులు బెదిరించారన్నారు.

ALSO READ | ట్యాపింగ్ ఫైల్స్: అరెస్టు నుంచి మినహాయింపు వద్దు.. ప్రభాకర్ రావుపై సుప్రీంకు సిట్

ఇలా నకిలీ పోలీస్ వేషంలో బంగారు దుకాణాల యజమానులను బెదిరించి రూ.18లక్షలు వసూల్ చేశారని తెలిపారు. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలలో మోసాలకు పాల్పడ్డారన్నారు. నకిలీ పోలీసులకు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామని తెలిపారు. నిందితుల నుంచి ఒక కారు, ఆటో, రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇలాంటి మోసగాళ్లతో ప్రజలు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.