భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా శ్రీధర్‌కు మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్టేట్ గవర్నమెంట్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 2015లో శ్రీధర్ సింగరేణి కంపెనీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సీఎండీగా రెండేండ్ల పాటు శ్రీధర్ ఈ పదవిలో కొనసాగిన తర్వాత ఏడాదికోసారి ఎక్స్టెన్షన్ కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, కోల్ మినిస్ట్రీకి ప్రతిపాదనలు పంపుతూ వస్తోంది. ఈ ఏడాది 31తో సీఎండీగా ఎనిమిదేండ్లు పూర్తి కావొస్తుండడంతో మరోసారి ఎక్స్ టెన్షన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టుగా కంపెనీలో చర్చ సాగుతోంది. ఎక్స్‌టెన్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీధర్ఎక్స్టెన్షన్ అక్రమమంటూ సింగరేణి కోల్ మైన్స్కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఇప్పటికే హైకోర్టులో పిల్ వేశారు.
