లాలాపేట విజయ డెయిరీ ఆఫీసు ఎదుట రైతుల ఆందోళన

లాలాపేట విజయ డెయిరీ ఆఫీసు ఎదుట రైతుల ఆందోళన
  •     పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇన్సెంటివ్స్‌‌‌‌, పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌
  •     డెయిరీకి వచ్చే లాభాలను పాడి రైతులకు పంచాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌/సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులు, పాల ఉత్పత్తిదారులపై వివక్ష చూపుతోందని తెలంగాణ పాడి రైతుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పాడి రైతులకు పెండింగ్‌‌‌‌లో ఉన్న లీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.4 ఇన్సెంటివ్స్‌‌‌‌ రిలీజ్ చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని సోమవారం హైదరాబాద్ లాలాగూడలోని విజయ డెయిరీ వద్ద పాడి రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 25.82 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పశు వుల దాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు పాడి రైతులను ప్రోత్సహించటానికి లీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.4 ఇన్సెంటివ్ ఇస్తామని 2014లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారని, అయితే, 2016 వరకు 15 రోజులకోసారి బిల్లుతో కలిపి పాడి రైతులకు ప్రోత్సాహం ఇచ్చారన్నారు. కానీ 2016 నుంచి పాడి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇన్సెంటివ్స్‌‌‌‌ జమ కాలేదని చెప్పారు. రైతులు నిరసన తెలిపితే 2020 డిసెంబర్ వరకు కొంతమందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలో వేశారని తెలిపారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు చాలా మంది పాడి రైతులకు ఇన్సెంటివ్స్‌‌‌‌ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు విజయ డెయిరీకి కాకుండా ప్రైవేట్ డెయిరీలకు పాలు పోస్తున్నారని చెప్పారు.  

ఇన్సెంటివ్స్‌‌‌‌ రూ.7కు పెంచాలి...

పాడి రైతులకు ఇస్తున్న ఇన్సెంటివ్స్‌‌‌‌ను రూ.4 నుం చి రూ.7కు పెంచి పాల బిల్లుతో చెల్లించాలని సాగ ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. అలాగే, పాడి పశువులకు ఉచి తంగా బీమా, రైతులకు రూ.10 లక్షల ప్రమాద బీమా, పశువులు కొనుగోలు చేసేందుకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు. డెయిరీకి వచ్చే లాభాలను రైతులకు పంచాలని డిమాండ్‌‌‌‌ చేశారు. విజయ డెయిరీకి  పర్మినెంట్‌‌‌‌ ఎండీ లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఈ మేరకు విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మల్లయ్యకు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా, ఐదుగురిని మాత్రమే లోపలికి అనుతించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు విన్నవించేందుకు వందల కిలో మీటర్ల నుంచి వస్తే ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దీంతో అధికారులే తమ వద్దకు రావాలని రైతు లు పట్టుబట్టారు. చేసేదేమీ లేక డెయిరీ అధికారులే రైతుల వద్దకు రాగా, రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ధర్నాలో తెలంగాణ పాడి రైతుల సంఘం కేంద్ర కమిటీ సభ్యులు శోభన్, పాడి రైతుల సంఘం రాష్ట్ర నాయకులు సాదం రమేశ్‌‌‌‌, సీఐటీయూ నాయకులు మహేందర్ పాల్గొన్నారు.

ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ రిలీజ్​ చేయాలి

లీటరుపై రూ.4 ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2016 దాకా ఇచ్చి ఆపేసింది. కొంతమందికి 2018 వరకు, ఇంకొంత మందికి 2020 వరకు ఇచ్చారు. చా లా మందికి ఇవ్వాల్సి ఉంది. పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇన్‌‌‌‌సెంటివ్స్‌‌‌‌ వెంటనే విడుదల చేయాలి. పశువులకు రావాల్సిన సబ్సిడీలు ఇప్పటికీ రాలేదు. ఆవులు మరణిస్తే ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. 
- రాజయ్య, పాడి రైతు, 
రామకృష్ణాపూర్, మంచిర్యాల జిల్లా

ఊళ్లలో పాలు అమ్ముకుంటం..

పాడి రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గ్రామాల్లో విజయ డైయిరీకి పాలు పోసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ, వారిని ప్రోత్సాహించే వారు లేరు. ఒకవైపు ఇన్సెంటివ్స్‌‌‌‌ ఆపేశారు. పశువులకు బీమా సదుపాయం కల్పించడంలేదు. ఇది ఇలాగే కొనసాగితే విజయ డెయిరీకి పాలు పోయడం మానేసి, గ్రామాల్లో పాలు అమ్ముకుంటాం. 
- బి.వెంకటేశ్‌‌‌‌, పాడి రైతు, బెల్లంపల్లి