మంత్రి కనుసన్నల్లోనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం : రావుల రామనాథ్

మంత్రి కనుసన్నల్లోనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం : రావుల రామనాథ్

నిర్మల్, వెలుగు : పచ్చని పంట పొలాలకు, రైతులకు తీవ్ర నష్టం చేకూర్చే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జ్ రావుల రామనాథ్, జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి ఆరోపించారు. దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసినప్పటికీ.. సర్కారుకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటన్నారు.

ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ధ్వజమెత్తారు. మంత్రి ఆధీనంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సైతం ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు, మంత్రి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.

బీజేపీకి ప్రజల్లో పెరిగిపోతున్న ఆదరణను చూసి మంత్రితోపాటు ఆ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల బాధ్యులు సత్యం చంద్రకాంత్, ముత్యంరెడ్డి, నాయకులు వీరేశ్, హరీశ్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.