మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట : ఏకే ఖాన్

మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట : ఏకే ఖాన్

తెలంగాణ మైనారిటీల కోసం ప్రభుత్వం అనేక అనేక కార్యక్రమాలు చేపడుతోందని మాజీ ఐపీఎస్ అధికారి, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు ఏకే ఖాన్ అన్నారు. 2022-23 సంవత్సరానికి మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా దర్గాలు, మసీదులు, శ్మశానవాటికల కాంపొండ్ వాల్స్ ను మరమ్మత్తు చేయనున్నారు.

అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించనుంది. వీటివల్ల దాదాపు 7వేల మంది విద్యర్థులు నాణ్యమైన విద్యను అందించనున్నారు. షాదీ ముబారక్ పథకం తీసుకొచ్చి సామాజిక మార్పుకు కారణం అయ్యారని ఖాన్ తెలిపారు. ఈ పథకం వల్ల 18 ఏళ్లు నిండిన తర్వాతే ఆడపిల్లలకు పెళ్లిల్లు చేస్తున్నారని తెలిపారు.