రాజకీయాల్లో కొత్త వాళ్లకు చాన్స్​ ఇవ్వాలే :స్టేట్​ హెల్త్​ డైరెక్టర్ శ్రీనివాస రావు

రాజకీయాల్లో కొత్త వాళ్లకు చాన్స్​ ఇవ్వాలే :స్టేట్​ హెల్త్​ డైరెక్టర్  శ్రీనివాస రావు

కొత్త వాళ్లకు చాన్స్​ ఇవ్వాలే

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  దశాబ్దాలుగా వాళ్లు, వాళ్ల కుటుంబాలే ప్రజాప్రతినిధులుగా ఉండాలా, కొత్త వాళ్లకు చాన్స్​ ఇవ్వరా అని స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​, డాక్టర్​ జీఎస్సార్​ ట్రస్ట్​ చైర్మన్​ గడల శ్రీనివాస రావు సంచలన కామెంట్స్​ చేశారు. డాక్టర్​ జీఎస్సార్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో ‘కొత్తగూడెం యువశక్తి’  పేరుతో ఆదివారం నిర్వహించిన వర్క్​ షాప్​లో ఆయన మాట్లాడారు..యువత లీడర్లుగా ఎదగాలనే లక్ష్యంతోనే తమ ట్రస్ట్​ ఆధ్వర్యంలో యువశక్తి వర్క్​ షాప్​ను రెండు రోజులుగా  నిర్వహిస్తున్నామన్నారు.

ప్రజాప్రతినిధులు ఎటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో ప్రశ్నించేందుకు ఈ యువశక్తి వర్క్​ షాప్​ ఒక వేదిక అని చెప్పారు. రాజకీయ వ్యవస్థ కొన్ని కుటుంబాలకే పరిమితమా? అని ప్రశ్నించారు.  కొంతమంది ప్రజాప్రతినిధులు బాగా పని చేస్తుంటే మరికొందరేమో ఆఫీసర్లను సరిగ్గా పనిచేసుకోనివ్వడం లేదన్నారు.  ఒక ఎమ్మెల్యే జీతం నెలకు రూ. 2.50లక్షలు అని,  తాను గత 25ఏండ్లకు పైగా కింది స్థాయి నుంచి స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ స్థాయికి ఎదిగితే జీతం కేవలం రూ. 1.90 లక్షలే అని చెప్పారు.   అన్ని నియోజకవర్గాలు సిద్దిపేట, సిరిసిల్ల మాదిరిగా డెవలప్​ కావాలన్నారు.

ఎన్​టీఆర్​, కేసీఆర్​ తనకు రాజకీయంగా ఆదర్శ నాయకులని పేర్కొన్నారు.  తాను రాజకీయాల్లోనే ఉన్నానని, రాజకీయాలంటే తన దృష్టిలో సేవ చేయడమేనన్నారు. మరో కొత్తగూడెం కోసం మీతో కలిసి నడిచి వచ్చేందుకే తాను నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో  పర్సనాలిటీ డెవలప్​ మెంట్​ నిపుణుడు గంపా నాగేశ్వరరావు, రాజశేఖర్​, సుధీర్​, నాయకులు  కాంపెల్లి కనకేష్​, మధుకర్​ పాల్గొన్నారు.