ఇథనాల్​ కంపెనీ రద్దు చేయాలి

ఇథనాల్​ కంపెనీ రద్దు చేయాలి

మరికల్, వెలుగు: ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు చక్రవర్తి కోరారు. మండలంలోని ఎక్లాస్​పూర్​ వద్ద ఇథనాల్​ కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం 9వ రోజుకు చేరాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. ఇథనాల్​ కంపెనీ రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. బండారి నర్సప్ప, మహదేవ్, రవీందర్​రెడ్డి, బండారి మల్లేశ్, తిరుపతయ్య, వెంకటయ్య, కురుమూర్తి, సత్తమ్మ, కొండమ్మ ఉన్నారు.