దేశంలో దమ్మున్న నాయకుడు కేసీఆర్

దేశంలో దమ్మున్న నాయకుడు కేసీఆర్

హైదరాబాద్: అగ్ర వర్ణాల పేదలను ఆదుకున్న ఘనత కేసీఆర్దేనని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద లబ్ధిదారులకు కేవీ రమణాచారితో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి చెక్కులను అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో మొత్తం 133 మంది విద్యార్థులకు ఆయన చెక్కులు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విదేశీ విద్య భారం అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి  పథకాన్ని అమలు చేయడం గొప్ప విషయమన్నారు. కులాల పరంగా ఇలాంటి పథకాలు తీసుకురావాలంటే దమ్ము ఉండాలని, దేశంలో అలాంటి దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని పొగిడారు.  బ్రాహ్మణ పరిషత్తు అమలు చేస్తున్న పథకాలను చూసి.... తమకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రెడ్డి , వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కోరుతున్నారని తెలిపారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకొని... వారి సామాజిక వర్గాల్లో పేదరికాన్ని నిర్ములించేందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు రూ.1500 కోట్ల ప్రభుత్వ నిధులతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా

విధ్వంసానికి దారితీసేలా బండి సంజయ్ వ్యాఖ్యలు