ఫలితాలొచ్చిన 3 రోజులకే MPP, ZP చైర్మన్లను ఎన్నుకోవాలి

ఫలితాలొచ్చిన 3 రోజులకే MPP, ZP చైర్మన్లను ఎన్నుకోవాలి

రాజ్యాంగం మీద గౌరవం లేకుండా కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు విపక్ష నేతలు. MPP, ZP ఛైర్మన్ ఎన్నిక, ఫలితాలతో పాటు పలు అంశాలపై.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీల నాయకులు… రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిని కలిశారు.

ఫలితాలకు, MPP, ZP ఛైర్మన్ ఎన్నికకు 40 రోజుల టైం పెడితే ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు అవకాశం ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మే 27న కౌంటింగ్ జరిపి.. 3 రోజుల్లోనే చైర్మన్, ఎంపీపీల ఎన్నిక పూర్తిచేయాలని ఈసీని కోరామన్నారు. గెలిచిన MPPలు, ZPఛైర్మన్ లు జులై 5 తర్వాత ఛార్జ్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామన్నారు.

గెలిచిన వారిని అంగడిలో సరుకులా కొనుక్కుంటున్నారని మండిపడ్డారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. ఫలితాల తర్వాత ఛైర్మన్ ల ఎన్నికకు ఎక్కువ సమయం ఇస్తే… 538 ఎంపిపిలు, 28 జెడ్పీ చైర్మన్ లు టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందని అన్నారాయన.