
రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ పై పార్టీ హైకమాండ్ సీరియస్ గా రియాక్టైంది. జగ్గారెడ్డి విమర్శలపై రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఆయన వీడియో క్లిపులను తెప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పీసీసీ చీఫ్ టూర్ కు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకు జిల్లాలో కార్యక్రమంపై ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. వన్ మ్యాన్ షో లా చేస్తే కుదరదని చెప్పారు.
పీసీసీ చీఫ్ పై జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై చర్చించేందుకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కావాలని చెప్పారు మాణిక్కం ఠాగూర్. సాయంత్రం జరగనున్న భేటీలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముందని చెప్తున్నారు హస్తం లీడర్లు. మరోవైపు రేవంత్ తీరుపై కూడా సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ పై నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మీటింగ్ కు మాణిక్కం ఠాగూర్ , పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు షబ్బీర్ అలీ, ఇతర నేతలు అటెండ్ కానున్నారు.