డబుల్‌‌ ఇంజిన్‌‌ సర్కార్‌‌తోనే అభివృద్ధి : కీర్తిరెడ్డి

డబుల్‌‌ ఇంజిన్‌‌ సర్కార్‌‌తోనే అభివృద్ధి : కీర్తిరెడ్డి

రేగొండ, వెలుగు : డబుల్‌‌ ఇంజిన్‌‌ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్‌‌చార్జి మాధవ్‌‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి చెప్పారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో సోమవారం నిర్వహించిన బూత్‌‌ కమిటీల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. బూత్‌‌ లెవల్‌‌లో ప్రతి ఓటరును కలిసి కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతుల కోసం కేంద్రం సబ్సిడీ ఎరువులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరలకు అమ్ముతూ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్‌‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్‌‌రెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, ఏడునూతుల నిశిధర్‌‌రెడ్డి, లింగంపెల్లి ప్రసాద్‌‌రావు, ఎరుకల గణపతి, దాసరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.