కేంద్రం ఆదేశాలు రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలి

కేంద్రం ఆదేశాలు రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలి
  • అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లెటర్

న్యూఢిల్లీ : కేంద్రం విడుదల చేసిన లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను అన్ని రాష్ట్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. కొన్ని రాష్ట్రాలు కేంద్రం గైడ్ లైన్స్ కాదని సొంతగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో కచ్చితంగా రూల్స్ ఫాలో కావాలని కోరుతూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లెటర్ రాశారు. కంటైన్ మెంట్ జోన్లలో నిత్యావసరాలు మాత్రమే అనుమతించాలని స్పష్టంగా లెటర్ లో పేర్కొంది. కేంద్రం నిషేధించిన జాబితాలో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించవద్దని ఆదేశించారు. కంటైన్ మెంట్ జోన్లో మినహా మిగతా జోన్లలో మాత్రం యధావిధిగా కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చని సూచించారు. ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ 4.0 అమల్లోకి వచ్చింది. ఈ సారి రాష్ట్రాలు సొంతంగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కేంద్రం కల్పించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విషయంలో రాష్ట్రాల ఇష్టానుసారం నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. విమాన సర్వీసులు, మెట్రో, స్కూల్, ప్రార్థనా మందిరాలు, ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్స్ కు మాత్రం అనుమతించలేదు. కంటైన్ మెంట్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు పర్మిషన్ ఇవ్వలేదు.