బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఉంది :సూర్యపల్లి శ్రీనివాస్

బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఉంది :సూర్యపల్లి శ్రీనివాస్

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని బీజేపీ ఓబీసీ పాలసీ అండ్ రీసెర్చ్ డివిజన్ స్టేట్ కన్వీనర్ సూర్యపల్లి శ్రీనివాస్ అన్నారు. 105వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఈ అధికారాలను రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. దీని ప్రకారం.. ఓబీసీ కులాల జనాభాను లెక్కించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణంగా ఉందన్నారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం ‘ఓబీసీ ఇంటలెక్చువల్ మీటింగ్’జరిగింది. 

ఇందులో ఓబీసీ కుల జనాభా లెక్కింపు, తదితర అంశాలపై చర్చించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, తెలంగాణ, ఏపీ నుంచి ఓబీసీ మేధావులు ఇందులో పాల్గొన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై మహారాష్ట్ర సర్కార్ అందించిన డేటా ప్రకారం సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ఓబీసీ రిజర్వేషన్లను ప్రకటించిందని చెప్పారు. మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలు బీసీల డేటాను ప్రకటించాయన్నారు. ఇలా అన్నీ రాష్ట్రాలు బీసీ కులాల లెక్కింపు ప్రకటిస్తే, అది దేశ ఓబీసీ కులాల లెక్కింపుగా మారుతుందని తెలిపారు.