మద్యం హోం డెలివరీ చేయండి: రాష్ట్రాలకు సుప్రీం సూచన

మద్యం హోం డెలివరీ చేయండి: రాష్ట్రాలకు సుప్రీం సూచన

న్యూ ఢిల్లీ: కరోనా ఎఫెక్టును దృష్టిలో ఉంచుకుని మద్యం హోం డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు, సోషల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ ను స్ట్రిక్టుగా అమలు చేసేందుకు మద్యం హోం డెలివరీ గురించి ఆలోచించడం మంచిదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయి లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఆంక్షలను సడలించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ వైన్ షాపులు తెరుచుకున్నాయి. అనేక చోట్ల మద్యం షాపుల ముందు జనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఉంటూ సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. దీంతో మద్యం అమ్మకాల విషయంలో దాఖలైన వ్యాజ్యంపై త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ‘‘మేము ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయము.. కానీ, సోషల్ డిస్టెన్స్ ను కొనసాగించేందుకు మద్యం హోం డెలివరీ చేసే అంశాన్ని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి”అని బెంచ్ అభిప్రాయపడింది.